నెలవారీ అద్దెతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు.. తీరనున్న వినియోగదారుల ముచ్చట!
Advertisement
అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఓ ఫోన్ మిమ్మల్ని ఊరిస్తోందా? కానీ దాని ధర మన రేంజ్‌లో లేదా? అయినా మరేం పర్వాలేదు. మీరు ముచ్చటపడుతున్న ఆ ఫోన్‌ను వాడుకునే అవకాశం కూడా ఉంది. ఎలాగో తెలుసుకోవాలంటే అంతకంటే ముందు ఆన్‌లైన్ రెంటల్ వెబ్‌సైట్ ‘రెంటో మోజో’ గురించి తెలుసుకోవాలి.

ఈ వెబ్‌సెట్‌లో ఖరీదైన ఫోన్లు.. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9, గెలాక్సీ నోట్ 8 వంటి ఫోన్లు ఉంటాయి. వీటిని ఆరు నెలలు, ఏడాది, రెండేళ్ల కాలపరిమితిపై అద్దెకు తీసుకోవచ్చు. ఫోన్‌ను బట్టి నెలకు రూ.2,099 నుంచి రూ.9,299 వరకు ఉంటుంది. రెండేళ్లపాటు అద్దె చెల్లించిన తర్వాత కావాలనుకుంటే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ ఎక్స్‌ను రెండేళ్లపాటు వాడాలనుకుంటే  నెలకు రూ.4,299 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలకే అయితే నెలకు రూ.9,299 చెల్లించాలి. అయితే, ఇందుకోసం ముందుగా రూ.9998 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. గూగుల్ పిక్సెల్ 2 ఫోన్‌ను రెండేళ్ల కాలానికి తీసుకుంటే నెలకు రూ.2,099, ఆరు నెలలకు అయితే రూ.5,398 చెల్లించాలి.. ఇలా ఒక్కో ఫోన్‌కు ఒక్కో ధర నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ఈ సేవలు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమని రెంటో మోజో పేర్కొంది. త్వరలోనే అన్ని నగరాలకు విస్తరిస్తామని తెలిపింది.
Thu, Aug 16, 2018, 09:18 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View