డిసెంబరు 31 తర్వాత ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు పనిచేయవు.. వెంటనే మార్చుకోండి: ఎస్‌బీఐ
Advertisement
ఈ ఏడాది డిసెంబరు 31 తర్వాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కలిగిన తమ ఏటీఎం కార్డులు పనిచేయవని భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది. అటువంటి కార్డులు కలిగిన ఖాతాదారులు వెంటనే వాటిని మార్చుకుని చిప్ కార్డులు తీసుకోవాలని సూచించింది. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేయడంలో భాగంగా రిజర్వు బ్యాంకు నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఇందులో భాగంగానే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కలిగిన కార్డులను రద్దు చేసి ఈఎంవీ (చిప్) కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొంది. వీటి కోసం ఈ ఏడాది డిసెంబరు 31 లోగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని ఎస్‌బీఐ సూచించింది.
Wed, Aug 15, 2018, 05:55 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View