పాకిస్తాన్ అంతా నన్ను 'వదిన' అని పిలుస్తుంది!: సానియా మీర్జా
Advertisement
Advertisement
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో తన వివాహంపై చాలాకాలం తర్వాత స్పందించింది. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ జంట దుబాయ్ లో ఉంటోంది. భారత్-పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి మేం పెళ్లి చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారని, అలాంటిదేమీ లేదని సానియా స్పష్టం చేసింది.

‘పాకిస్తాన్ లోని మా అత్తవాళ్లను కలవటానికి ఏడాదికోసారి మాత్రమే వెళతాను. పాకిస్తాన్ ప్రజలు నాపై అపారప్రేమ కురిపిస్తారు. ఆ దేశం అంతా నన్ను వదిన అని పిలుస్తుంది. షోయబ్ ను క్రికెటర్ గా పాక్ ప్రజలు అభిమానిస్తారు. ఆ అభిమానమే నాపై ప్రేమగా మారింది’ అని చెప్పారు.

ప్రస్తుతం 8వ నెల గర్భవతిగా ఉన్న సానియా త్వరలోనే తల్లికానుంది. నెలలు నిండినా తాను రోజుకు 4-5 కిలోమీటర్లు నడుస్తానని సానియా చెప్పింది. వారానికి నాలుగుసార్లు యోగా చేస్తానని తెలిపింది. 
Tue, Aug 14, 2018, 09:37 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View