పతనమైన రూపాయి విలువ.. భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
Advertisement
కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. నేటి ట్రేడింగ్ లో డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 69.83 వద్ద కొనసాగుతోంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 224 పాయింట్లు పతనమై 37,645కి పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 11,356కు జారిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అపోలో హాస్పిటల్స్ (12.79%), యూనైటెడ్ బ్రూవరీస్ (8.31%), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ (6.34%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (5.34%), క్వాలిటీ (4.87%).

టాప్ లూజర్స్:
వక్రాంగీ (-19.95%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (-10.39%), హ్యాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ (-8.52%), బజాజ్ ఎలక్ట్రికల్స్ (-8.20%), సన్ టీవీ నెట్ వర్క్స్ (-7.80%).    
Mon, Aug 13, 2018, 04:20 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View