రోగిని స్పృహలోనే ఉంచి అరుదైన ఆపరేషన్ చేసిన సన్ షైన్ హాస్పిటల్స్!
Advertisement
మెదడులో కణితి కారణంగా తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళా రోగిని స్పృహలోనే ఉంచి 'అవేక్ క్రేనియాటమీ' శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది హైదరాబాద్, గచ్చిబౌలీలోని సన్ షైన్ హాస్పిటల్స్. కృష్ణా జిల్లాకు చెందిన 46 సంవత్సరాల అలివేలమ్మకు ఈ ఆపరేషన్ ను ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ రంగనాథమ్ ఆధ్వర్యంలో నిర్వహించి, మెదడులో కుడివైపున్న 2.5 సెంటీమీటర్ల కణితిని తొలగించారు.

ఆమె బరువు 129 కిలోలకు పైగా ఉండటం, హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ లోపంతో ఆమె బాధపడుతుండగా, క్రేనియాటమీ విధానంలో శస్త్ర చికిత్స సాధ్యం కాదని నిర్ణయించుకుని అవేక్ క్రేనియాటమీ నిర్వహించామని, ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ ఆమె మాట్లాడుతూనే ఉండటం విశేషమని డాక్టర్ రంగనాథమ్ వెల్లడించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు.
Mon, Aug 13, 2018, 12:06 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View