రాంచీలో విమానం దిగేందుకు భయపడిన కత్రినా కైఫ్!
Advertisement
కల్యాణ్ జువెల్లర్స్ షాపు ప్రారంభం కోసం రాంచీకి ప్రత్యేక విమానంలో వచ్చిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విమానం నుంచి దిగేందుకు భయపడింది. ఎందుకో తెలుసా? బయట వర్షం పడుతూ ఉండటమే కారణం. విమానం దిగితే, తడుస్తానని ఆమె సంశయించి, 10 నిమిషాల పాటు కదలకుండా కూర్చుండిపోవడంతో, ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది ఓ గొడుగును తీసుకుని విమానం దగ్గరికి వచ్చారట.

ఆపై కత్రినా విమానం దిగేందుకు అంగీకరించింది. అప్పటికే కత్రినా వస్తోందని తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టు టర్మినల్ భవనానికి చేరుకుని, తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు పోటీ పడ్డారు. కత్రినా సైతం తన అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరితో సెల్ఫీలు దిగింది. వారిని అదుపు చేసేందుకు ఎయిర్ పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చిందట. మరి 'మల్లీశ్వరా... మజాకా?'!
Mon, Aug 13, 2018, 09:57 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View