లండన్ వీధుల్లో రేడియోలు అమ్ముతున్న సచిన్ కొడుకు అర్జున్!
Advertisement
ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(18) హల్ చల్ చేశాడు. ఎంసీసీ యంగ్ క్రికెటర్స్ శిక్షణలో భాగంగా లండన్ కు వచ్చిన అర్జున్ శుక్రవారం లార్డ్స్ ముందు పాకెట్ రేడియోలు అమ్మాడు. ఈ ఫొటోలను టర్బొనేటర్ హర్బజన్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.


తన ట్విట్టర్ ఖాతాలో ‘క్రికెట్ కు పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో రేడియోను ఎవరు అమ్ముతున్నారో  చూడండి . దాదాపు 50 రేడియోలను అమ్మేశాం. ఇంకొన్ని మాత్రమే మిగిలాయి. జూనియర్ సచిన్. గుడ్ బాయ్‘ అని బజ్జీ ట్వీట్ చేశాడు.

లార్డ్స్ లో భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వర్షం సందర్భంగా పిచ్ ను కవర్ చేసేందుకు అర్జున్ గ్రౌండ్ సిబ్బందికి సాయం చేశాడు.
Sun, Aug 12, 2018, 11:17 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View