గంగూలీ చేతికి బీసీసీఐ పగ్గాలు!
Advertisement
భారత క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొంది, ప్రస్తుతం క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ, త్వరలోనే బీసీసీఐ పగ్గాలను చేపట్టవచ్చని అంటున్నాయి క్రికెట్ వర్గాలు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించే సమయం ఆసన్నమైందని చెబుతున్నాయి.

బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ ను సవరించడం, దానికి సుప్రీంకోర్టు ఆమోదం పలికిన నేపథ్యంలో ప్రస్తుత, మాజీ అడ్మినిస్ట్రేటర్లు అందరూ అధ్యక్ష పదవికి అనర్హులు అయ్యారు. ఈ నేపథ్యంలో, కొత్త వ్యక్తి రాక అనివార్యం కాగా, పలువురు మాజీ క్రికెటర్లకు చాన్స్‌ ఉన్నప్పటికీ, క్రికెట్ రాజకీయాల్లో ఆరితేరిన గంగూలీకి మిగతావారితో పోలిస్తే మరిన్ని అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది. సౌరవ్ అధ్యక్షుడైతే రెండేళ్ల పాటు అతను ఈ పదవిలో ఉంటాడు.
Sun, Aug 12, 2018, 09:18 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View