వారాంతంలో నష్టాలలో స్టాక్ మార్కెట్లు!
Advertisement
వరుస లాభాలతో కొన్ని రోజులుగా మంచి దూకుడు మీదున్న మన స్టాక్ మార్కెట్లకు ఈ రోజు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. అసలు ఈ రోజు మార్కెట్లు ప్రారంభం నుంచీ ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. చివరికి కోలుకోలేక నష్టాలతో ముగిశాయి.

దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు కోల్పోయి 37869 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11429 వద్ద క్లోజ్ అయ్యాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగాల షేర్లతో పాటు, సన్ ఫార్మా, టాటా మోటార్స్, గెయిల్, వేదాంత, పవర్ గ్రిడ్, ఎల్&టీ వంటి షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు కోలుకోలేకపోయాయి. ఈ క్రమంలో హీరో మోటా కార్ప్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఐషర్ మోటార్స్, టీసీఎస్, బీపీసీఎల్ వంటి షేర్లు మాత్రం లాభపడ్డాయి. 
Fri, Aug 10, 2018, 04:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View