తన పేస్ తో కోహ్లీ, రాహుల్, ధావన్ లను ఇబ్బంది పెట్టిన అర్జున్ టెండూల్కర్... వీడియో!
Advertisement
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ టీమిండియా కెప్టెన్ ను, ఓపెనర్లను తన ఫాస్ట్ బౌలింగ్ తో ఇబ్బంది పెట్టడమేంటని అనుకుంటున్నారా? నిజమే. రెండో టెస్టుకు సన్నద్ధమయ్యేందుకు ప్రాక్టీస్ చేస్తున్న భారత బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్ తదితరులు లెఫ్టార్మ్ పేసర్ అర్జున్ బౌలింగ్ లో ఆడారు. వీరంతా నిప్పులు చెరిగేలా వస్తున్న అర్జున్ బంతులను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు.

 ఇంగ్లండ్ యువ సంచలనం స్కామ్ కరన్ వేస్తున్న బంతులను ఆడటంలో భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, అర్జున్ తో బంతులేయించిన టీమ్ మేనేజ్ మెంట్ కాసేపు ప్రాక్టీస్ చేయించింది. లార్డ్స్ మైదానంలో కరన్ పేస్ బౌలింగ్ ను టాపార్డర్ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, ఇలా ప్రాక్టీస్ చేయించడమే మంచిదని పలువురు మాజీలు కూడా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అర్జున్ బౌలింగ్ పైనా ప్రశంసల జల్లు కురిపించారు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ను మీరూ చూడండి.
Fri, Aug 10, 2018, 12:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View