"ఓం ఇహైదే..." అంటూ చేతులు చాస్తే, పూలగుత్తిని విడిచిన షిర్డీ సాయి... వైరల్ అవుతున్న వీడియో!

10-08-2018 Fri 10:01
advertisement

ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ, సాయి బాబా మహిమ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ గుడిలో సాయి విగ్రహాన్ని అలంకరించి, ఆయన ఒళ్లో పెట్టిన ఓ పూల గుత్తి, అర్చకుడు చేతులు చాచగానే ఆయన చేతిలో పడుతున్న దృశ్యం ఇందులో ఉంది. సాయిని పూజిస్తూ మంత్రోచ్చారణ చేస్తున్న అర్చకులు "ఓం ఇహైదే..." అంటూ రెండు చేతులనూ సాయి ముందు చాచగా, అందులో పూల గుత్తి పడింది.

 ఆ వెంటనే భక్తులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఇది సాయి మహిమేనని నమ్ముతున్న ఎంతో మంది దీన్ని వాట్స్ యాప్, ఫేస్ బుక్ మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియోను ఏ గుడిలో తీశారన్న విషయమై స్పష్టత లేదు. ఆ వీడియోను మీరూ చూడండి. 

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement