మార్కెట్ల జోరు.. సెన్సెక్స్ సరికొత్త రికార్డు!
Advertisement
ఈ రోజు సెన్సెక్స్ పాత రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 38 వేల మార్క్ దాటింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 137 పాయింట్లు లాభపడి 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. కాగా, ఎన్ఎస్ఈలో హిందాల్కో, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, వేదాంత సంస్థల షేర్లు లాభపడగా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టైటాన్, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, సిప్లా సంస్థల షేర్లు నష్టపోయాయి. 
Thu, Aug 09, 2018, 06:31 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View