పీవీ సింధుకు విలువైన సూచనలు చేసిన ప్రత్యర్థి కరోలినా మారిన్
Advertisement
ఒలింపిక్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్ విలువైన సూచనలు చేసింది. గత రెండేళ్లలో రెండు మేజర్ ఫైనల్లో కరోలినా చేతిలో సింధు ఓటమిపాలైంది. 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఇటీవలి బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌ విజేత అయిన కరోలినాకు రెండుసార్లు ప్రత్యర్థి పీవీ సింధునే.

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి స్వదేశం స్పెయిన్ వెళ్తూ విమానాశ్రయంలో కరోలినా మాట్లాడుతూ సింధుకు విలువైన సూచనలు చేసింది. పైనల్స్‌లో సింధు ఎందుకు గెలవలేకపోతోందన్న విషయం తనకు సరిగ్గా తెలియదని పేర్కొంది. అయితే, ఫైనల్స్ ఆడేటప్పుడు సింధు ఆందోళనకు గురవుతున్నట్టు అనిపిస్తోందని తెలిపింది. దీనిని తగ్గించుకోవాలని సూచించింది.  దానిని నియంత్రించుకోగలిగితే విజయాలు సొంతం చేసుకుంటుందని పేర్కొంది.

రెండేళ్ల క్రితం సింధు-మారిన్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌ను భారత్‌లో 17.2 మిలియన్ల మంది వీక్షించారు. ఫలితంగా క్రికెట్ తర్వాత ఎక్కుమంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొన్న మారిన్ టోర్నమెంట్ల సమయంలో తామిద్దం కలిసి షాపింగ్‌లకు వెళ్లమని, సీక్రెట్‌లు షేర్ చోసుకోబోమని పేర్కొంది.

ఫైనల్స్ కోసం తాను చాలా కష్టపడతానని, తామిద్దరం ప్రత్యర్థులుగా తలపడేటప్పుడు సింధుపై ఎలా ఆడాలో తనకు బాగా తెలుసని మారిన్ వివరించింది. ఒత్తిడికి ఆమె గురవుతుందో లేదో తనకు తెలియదని, కానీ తానైతే ఆమెపై ఒత్తిడి పెంచుతూనే ఉంటానని మారన్ వివరించింది. 
Thu, Aug 09, 2018, 09:08 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View