ఆ బంతి వెనుక కథను చెప్పిన ధోనీ!
Advertisement
ఈమధ్య జరిగిన ఇంగ్లండ్‌-ఇండియా మూడో వన్డే మ్యాచ్ ను టీవీలలో తిలకించిన క్రికెట్ ప్రియులను ఓ విషయం బాగా ఆకట్టుకుంది. ఆ మ్యాచ్ లో ఇండియా పరాజయం తర్వాత అంపైర్ల నుండి ధోనీ బంతిని తీసుకున్నాడు.. అలా ఎందుకు తీసుకున్నాడో అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదు. అయితే దానికి కారణాన్ని ధోనీ ఇప్పుడు చెప్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లలా మన బౌలర్లు రివర్స్ స్వింగ్‌ ఎందుకు రాబట్టలేకపోతున్నారో తెలుసుకుందామనే ఆ బంతిని తీసుకున్నట్టు చెప్పాడు.

 ఎందుకంటే, ప్రపంచ కప్ ఆడే సత్తా వున్న మనకు రివర్స్ స్వింగ్ రాబట్టే స్థితి కూడా ఉండాలన్నాడు. వచ్చే ఏడాది మనం ఇంగ్లండ్‌లోనే ప్రపంచ కప్‌ ఆడబోతున్నాం కాబట్టి మనకు కచ్చితంగా రివర్స్‌ స్వింగ్‌ రావాలని, ఇది మ్యాచ్ లో ఎంతో కీలకంగా ఉంటుందని ధోనీ పేర్కొన్నాడు. ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాడన్న ధోనీ.. ఇప్పటికే కోహ్లీ ఎంతో సాధించాడని, దిగ్గజం అనిపించుకునేందుకు తన శక్తియుక్తులకు పదును పెడుతున్నాడని ప్రశంసించాడు.
Wed, Aug 08, 2018, 04:33 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View