ఇది క్రికెట్ టూరా? లేక హానీమూన్ టూరా?: అనుష్క శర్మ, బీసీసీఐలపై నెటిజన్ల ఫైర్
Advertisement
బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ ఫొటో అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు, మేనేజ్ మెంట్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానం మేరకు లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా వారితో పాటు అక్కడకు వెళ్లింది. ఈ సందర్భంగా అంతా కలసి ఓ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలో అనుష్క కూడా ఉంది. ఈ ఫొటోను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

ఈ ఫొటోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. టీమిండియాలో అనుష్క కూడా ఉందా? టీమ్ తో కలసి అనుష్క ఎందుకుంది? ఇది క్రికెట్ టూరా? లేక హనీమూన్ టూరా? అంటూ నెటిజన్లు బీసీసీఐ, అనుష్కలపై మండిపడుతున్నారు. మరోవైపు, భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్టు రేపు ప్రారంభంకానుంది. తొలి టెస్టులో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 
Wed, Aug 08, 2018, 02:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View