రెడ్ మీ నోట్ 5 ప్రో ఫ్లాష్ సేల్ నేడే..!
Advertisement
భారత్ లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన రెడ్ మీ నోట్ 5 ప్రో ఫ్లాష్ సేల్ కు మరోసారి రంగం సిద్ధమైంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు ఎంఐ.కామ్ వెబ్ సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ మొదలుకానుంది. షియోమీ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మీ 5 ప్రో ను భారత మార్కెట్ లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ను రూ.14,999కు, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ను రూ.16,999కు షియోమీ భారత్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా తీసుకొచ్చిన ఈ ఫోన్ లో 18:9 డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 636 ఎస్ వోసీ, డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరా, 12 మెగా పిక్సెల్  ప్రైమరీ సెన్సర్, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సర్, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఉన్నాయి. ఇందులోని మెమొరీని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
Wed, Aug 08, 2018, 09:44 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View