నాకు ఫైనల్స్ భయం లేదు.. కచ్చితంగా స్వర్ణం సాధిస్తా: పీవీ సింధు
Advertisement
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఫైనల్స్ లో మారిన్ కు తొలి రౌండ్ లో గట్టి పోటీని ఇవ్వగలిగానని చెప్పింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గట్టి ప్రత్యర్థులే ఉంటారని... విజయం కోసం ప్రతి ఒక్కరు శ్రమిస్తారని తెలిపింది. తనకు ఫైనల్స్ భయం లేదని... భవిష్యత్తులో కచ్చితంగా స్వర్ణ పతకాన్ని సాధిస్తానని చెప్పింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న పుల్లెల గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడుతూ సింధు ఈ మేరకు స్పందించింది.

ఫైనల్స్ లో ఓడిపోయానని బాధపడనని, మరో పతకం వచ్చిందని సంతోషిస్తానని తెలిపింది. తాను ఫైనల్స్ కు వచ్చి ఓడిపోతున్నానని కొందరు అంటున్నారని, కానీ ఫైనల్స్ కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలని చెప్పింది. వచ్చే ఏడాది తాను స్వర్ణ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
Tue, Aug 07, 2018, 12:10 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View