కళకళలాడిన స్టాక్ మార్కెట్లు.. లాభాల పంట!
Advertisement
ఈ వర్షాకాలం చివరి రెండు నెలల్లోనూ సాధారణ వర్షపాతం పడుతుందంటూ భారత వాతావరణ శాఖ చెప్పిన చల్లని కబురుతో నేటి స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ రోజు ఉదయం నుంచే లాభాల్లో కొనసాగిన మన మార్కెట్లు చివర్లో కూడా లాభాలతోనే క్లోజ్ అయ్యాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల షేర్ల అండతో సెన్సెక్స్ 135.73 పాయింట్లు లాభపడి 37691.89 వద్ద, నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిశాయి.

ఇక లాభాలు పండించుకున్న షేర్ల విషయానికి వస్తే, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీల షేర్లు వున్నాయి. రెడ్డీ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా, గెయిల్, హెచ్ యూఎల్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలను పొందాయి.  
Mon, Aug 06, 2018, 05:08 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View