ఆసియా గేమ్స్ ప్రమోషన్ కోసం 65 వేలమంది ఇండోనేషియన్లు.. అధ్యక్షుడితో కలిసి స్టెప్పేసిన వైనం!
Advertisement
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు ఈసారి ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు రాజధాని జకార్తా, పాలెంబంగ్‌లలో క్రీడలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. నగరాలను అందంగా అలంకరిస్తున్నారు. కాగా, ఆసియన్ గేమ్స్‌ను ప్రమోట్ చేసేందుకు ఇండోనేషియన్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు.

ఆదివారం 65 వేల మంది ఇండోనేషియన్లు తెల్లని దుస్తులు ధరించి ఒక్కసారిగా జకార్తా వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు జోకో విడోడో కూడా వారితో జతకలిశారు. అందరూ కలిసి ‘పోకో పోకో’ డ్యాన్స్ చేశారు. అతి పెద్ద సామూహిక డ్యాన్స్‌గా గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. కాగా, అదే సమయంలో దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న 1.20 లక్షల మందికిపైగా ఖైదీలు కూడా డ్యాన్స్ చేయడం విశేషం. పోకో పోకో డ్యాన్స్‌తో తమకు ప్రపంచ గుర్తింపు లభిస్తుందని ఇండోనేషియన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
Mon, Aug 06, 2018, 12:21 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View