వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో పీవీ సింధుకు చుక్కెదురు
Advertisement
ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఓటమిపాలైంది. స్పెయిన్ క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఆమె పరాజయంపాలైంది. తొలి సెట్ లో సింధు పోరాట పటిమను కనబరిచినప్పటికీ, రెండో గేమ్ లో ఆమె చేతులెత్తేసింది. మొదటి గేమ్ ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న కరోలినా... రెండో సెట్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 21-10 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది.

ఏదేమైనప్పటికీ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండో రజతాన్ని కైవసం చేసుకున్న సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మొత్తమ్మీద ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధుకు ఇది నాలుగో మెడల్. 2017లో కూడా ఆమె సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకుంది. 2014, 2015లలో బ్రాంజ్ మెడల్స్ ను సాధించింది. మరోవైపు కరోలినా మారిన్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో మూడో స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు పుటల్లోకి ఎక్కింది.
Sun, Aug 05, 2018, 04:20 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View