మ్యాచ్ ఓడిపోయినా.. కోహ్లీ ఖాతాలోకి మరో రెండు రికార్డులు వచ్చి పడ్డాయి!
Advertisement
ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో బ్యాట్స్ మెన్ వైఫల్యం కారణంగా టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరో రెండు రికార్టులను తన ఖాతాలోకి వేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి విరాట్ 200 (149, 51) పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో ఒక మ్యాచ్ లో ఎక్కువ సార్లు 200 లేదా అంతకు మించి పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. దీనికి తోడు ఇంగ్లండ్ పై ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ కెప్టెన్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ ఘనతను ఇప్పటి వరకు ఇండియా తరపున మన్సూర్ అలీఖాన్ పటౌడీ మాత్రమే సాధించాడు. 1967లో లీడ్స్ లో జరిగిన టెస్టులో పటౌడీ 212 (64, 148) పరుగులు చేశాడు.

ఇదే సమయంలో కోహ్లీ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్టుల్లో కూడా భారత్ ఓటమిపాలైంది. తద్వారా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కెప్టెన్ గా సాధించిన చెత్త రికార్డును (5 సెంచరీలు) ఇప్పుడు కోహ్లీ సమం చేశాడు. 
Sun, Aug 05, 2018, 02:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View