ట్రాక్టర్ తో ధోని సందడి.. కేరింతలు కొట్టిన అభిమానులు!
Advertisement
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తమిళనాడులో సందడి చేశాడు. తిరునెల్వేలిలో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్ పీఎల్) మ్యాచ్ చూసేందుకు వచ్చిన మహి ట్రాక్టర్ నడిపాడు. మైదానమంతా ట్రాక్టర్ పై తిరుగుతూ అభిమానులు, ప్రేక్షకులను అలరించాడు. దీంతో మ్యాచ్ చూసేందుకు హాజరైన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.

మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించేందుకు మహి శనివారం స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఐపీఎల్ సీజన్ కల్లా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. ఇకపై ప్రతి ఏటా టీఎన్ పీఎల్ మ్యాచ్ లకు హాజరవుతానని చెప్పాడు.
Sun, Aug 05, 2018, 11:50 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View