కస్టమర్లకు పెనాల్టీల వాత.. రూ.5000 కోట్లు వసూలు చేసిన బ్యాంకులు!
Advertisement
ఒకప్పుడు బ్యాంకులంటే డబ్బులు దాచుకోవడానికే వెళ్లేవారు. మారుతున్న కాలంతో బ్యాంకులు కూడా మారాయి. లోన్లతో పాటు ఇప్పుడు బ్యాంకులు రకరకాల సేవలు అందిస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో కనీస మొత్తాలను అకౌంట్ లో ఉంచని వారిపై బ్యాంకులు జరిమానాలు విధించడం మనం చూస్తున్నాం. తాజాగా దీనికి సంబంధించి ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇలా కనీస మొత్తాలను అకౌంట్ లో ఉంచనివారి నుంచి రూ.4,988 కోట్లను వసూలు చేశాయి! వీరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,434 కోట్లతో మొదటిస్థానంలో నిలవగా, హెచ్ డీఎఫ్ సీ(రూ.500 కోట్లు), యాక్సిస్ బ్యాంక్(రూ.530 కోట్లు), ఐసీఐసీఐ(రూ.317 కోట్లు), పీఎన్ బీ(రూ.211 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

లోక్ సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు జవాబిచ్చింది. అయితే కనీస డిపాజిట్ కు కొన్నిరూపాయలు తక్కువైనా బ్యాంకులు పెనాల్టీలు వేస్తున్నాయని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
Sun, Aug 05, 2018, 11:12 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View