తొలి టెస్టులో టీమిండియా ఓటమి!
Advertisement
ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. ఐదు టెస్టుల సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అలరించినా... జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 31 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలయింది. చేతిలో 5 వికెట్లు ఉండగా 84 పరుగుల విజయ లక్ష్యంతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను తొలి ఓవర్లోనే ఆండర్సన్ బోల్తా కొట్టించాడు. 20 పరుగులు చేసిన కార్తీక్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

అనంతరం మొహమ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (11) పెవిలియన్ చేరారు.  కాసేపు పోరాడిన హార్ధిక్ పాండ్యా 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ 4, ఆండర్సర్, బ్రాడ్ లు చెరో 2, కరణ్, రషీద్ లు చెరో వికెట్ తీశారు.

స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్: ఇంగ్లండ్ 287 ఆలౌట్. ఇండియా 274 ఆలౌట్.
రెండో ఇన్నింగ్స్: ఇంగ్లండ్ 180 ఆలౌట్. ఇండియా 162 ఆలౌట్. 
Sat, Aug 04, 2018, 05:27 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View