కోహ్లీ సెంచరీ చేయడానికి కారణం మేమే!: జేమ్స్ అండర్సన్
Advertisement
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, కోహ్లీ సెంచరీ చేయడానికి తామే కారణమని ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అన్నాడు. తమ ఫీల్డర్లు క్యాచ్ లను వదిలేయడం వల్లే కోహ్లీ సెంచరీ చేయగలిగాడని చెప్పాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్లిప్స్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను అందుకుని ఉంటే... అతని గురించి మాట్లాడుకునే అవసరం కూడా ఉండేది కాదని అన్నారు. 21 పరుగుల వద్ద కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఉన్న డేవిడ్ మలాన్ వదిలేశాడు. అనంతరం 51 పరుగుల వద్ద కూడా కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను మరోసారి మలాన్ వదిలేశాడు.

కోహ్లీలాంటి బెస్ట్ బ్యాట్స్ మెన్ ఆడుతున్నప్పుడు ఫీల్డర్లు జాగ్రత్తగా ఉండాలని, అతనికి అవకాశాలు ఇవ్వకూడదని ఆండర్సన్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీని త్వరగా పెవిలియన్ కు చేర్చి, మ్యాచ్ లో పైచేయి సాధిస్తామని అన్నాడు. ప్రపంచంలో ఏదీ కష్టం కాదని, అలాగే కోహ్లీని ఔట్ చేయడం కూడా అసంభవమేమీ కాదని చెప్పాడు. 
Sat, Aug 04, 2018, 02:18 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View