ఒకేసారి రెండు చిత్రాలతో పలకరించనున్న సమంత
03-08-2018 Fri 15:34
- తెలుగు .. తమిళ భాషల్లో 'యూ టర్న్'
- తమిళంలో శివకార్తికేయన్ తో 'సీమరాజా'
- సెప్టెంబర్ 13వ తేదీన రెండు సినిమాలు విడుదల

ఈ ఏడాదిలో సమంత ఇంతవరకూ ఇటు తెలుగులోనూ .. అటు తమిళంలోను చేసిన సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. ప్రస్తుతం సమంత 'యూ టర్న్' సినిమా చేస్తోంది. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోను విడుదల కానుంది. రెండు భాషల్లోను ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయి.
ఇక తమిళంలో సమంత 'సీమ రాజా' సినిమా చేస్తోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి పొన్ రామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తమిళనాట సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఒకే రోజున సమంత రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించనుందన్నమాట. ఒకేసారి రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి మరి.
ADVERTSIEMENT
More Telugu News
సముద్ర గర్భంలో పంచదార కొండలు... ఓ అధ్యయనంలో వెల్లడి
6 minutes ago

ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ
17 minutes ago

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
41 minutes ago

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
48 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
2 hours ago
