జియో గిగా బైట్ టారిఫ్ ప్లాన్ల వివరాలు... ఆన్ లైన్ లో లీక్!
Advertisement
భారత టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో ఆల్ట్రా హైస్పీడ్ ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఈ సేవల కోసం ఆగస్టు 15 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పిన తరుణంలో టారిఫ్ ప్లాన్లు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, 50 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో నెలకు 300 జీబీ వాడుకునేందుకు రూ. 500 చెల్లించాల్సి వుంటుంది. అదే 450 జీబీకయితే రూ. 750 చెల్లించాలి. ఇక 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో నెలకు 600 జీబీ కావాలంటే రూ. 999, 750 జీబీ కావాలంటే రూ. 1,299 చెల్లించాలట. 150 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలని కోరుకుంటే నెలకు 900 జీబీ డేటా కోసం రూ. 1,500 చెల్లించాలని సంస్థ నిర్ణయించిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో జియో అధికారికంగా స్పందించాల్సి వుంది.
Fri, Aug 03, 2018, 12:43 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View