టెక్నాలజీని కాపీ కొట్టిన యాపిల్.. భారీ జరిమానా విధించిన కోర్టు!
Advertisement
Advertisement
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కు షాక్ తగిలింది. మరో కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల పేటెంట్ హక్కుల్ని ఉల్లంఘించినందుకు కాలిఫోర్నియాలోని ఓ ఫెడరల్ కోర్టు యాపిల్ కు రూ.995 కోట్ల భారీ జరిమానా విధించింది. విలాన్ అనే సంస్థకు సంబంధించిన వైర్ లెస్ టెక్నాలజీ పేటెంట్ హక్కుల్ని యాపిల్ ఉల్లంఘించిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

యాపిల్ తన సాంకేతికతను కాపీ కొట్టిందనీ, కాబట్టి నష్టపరిహారంగా రూ.1,702 కోట్లు చెల్లించాలని 2013లో ఓ న్యాయస్థానాన్ని విలాన్ ఆశ్రయించింది. అయితే అక్కడ తీర్పు యాపిల్ కు అనుకూలంగా రావడంతో విలాన్ ప్రతినిధులు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేశారు. కాగా, ఈ తీర్పుపై తాము అప్పీల్ కు వెళతామని యాపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Thu, Aug 02, 2018, 03:54 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View