ఆర్బీఐ పాలసీ ప్రభావంతో నష్టాలను చవిచూసిన మార్కెట్లు
Advertisement
కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో... దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆర్బీఐ ప్రకటన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోయి 37,522కు పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 11,346 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ (9.48్%), గతి లిమిటెడ్ (8.88%), హిందుస్థాన్ కాపర్ (7.99%), ఐడీబీఐ బ్యాంక్ (5.61%), ట్రైడెంట్ లిమిటెడ్ (5.44%).

టాప్ లూజర్స్:
టాటా గ్లోబల్ బెవరేజెస్ (-4.49%), రేమండ్ లిమిటెడ్ (-4.31%), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-4.12%), ఇమామీ (-4.03%), రిలయన్స్ పవర్ (-3.58%). 
Wed, Aug 01, 2018, 04:20 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View