158 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో ఆర్బీఐ పాలసీ సమావేశం ఉన్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆశాభావంతో ట్రేడింగ్ చేశారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 37,494కు చేరుకుంది. నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 11,320 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్స్ మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (13.02%), అదానీ పవర్ (10.88%), నవకార్ కార్పొరేషన్ (10.81%), గతి లిమిటెడ్ (10.13%), బ్యాంక్ ఆఫ్ బరోడా (9.92%).

టాప్ లూజర్స్:
ఇన్ఫో ఎడ్జ్ (-3.93%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (-3.92%), కేఈసీ ఇంటర్నేషనల్ (-3.48%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-2.93%), రిలయన్స్ ఇన్ఫ్రా (-2.78%).   
Mon, Jul 30, 2018, 04:16 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View