అత్యంత ఖరీదైన ఫోన్ ను లాంచ్ చేసిన ఎల్ జీ.. ధర లక్షకు పైనే!
Advertisement
దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం ఎల్ జీ అత్యంత ఖరీదైన ఫోన్ ను లాంచ్ చేసింది. గతేడాది  లాంచ్ చేసిన సిగ్నేచర్ సిరీస్ కు కొనసాగింపుగా ప్రీమియం సిగ్నేచర్ ఎడిషన్(2018)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీతో వస్తున్న ఈ ప్రీమియం ఫోన్ రూ.1,22,820కు లభ్యం కానుంది. ఇప్పటివరకూ ఐఫోన్ ఎక్స్ మాత్రమే రూ.1,02,425 తో అత్యంత ఖరీదైన ఫోన్ గా ఉండేది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ లో మెమొరీని 2 టీబీ వరకూ విస్తరించుకోవచ్చని ఎల్ జీ వెల్లడించింది.

ఫోన్ వెనుకవైపు సెన్సార్లతో కూడిన రెండు 16 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఎల్ జీ తెలిపింది. ఈ మొబైల్ లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు క్యూహెచ్ డీ డిస్ ప్లే,  వైర్ లెస్ చార్జింగ్, క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నట్లు ఎల్ జీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ను నేటి నుంచే ప్రారంభించామని పేర్కొంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ ప్రూఫ్ అని కంపెనీ తెలిపింది.
Mon, Jul 30, 2018, 12:58 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View