జీఎస్టీ రేట్లు తగ్గిన ఫలితం.. పలు ఉత్పత్తులపై ధరలు తగ్గించిన శాంసంగ్
Advertisement
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ పలు ఉత్పత్తులపై ధరలను తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో శాంసంగ్ కూడా ధరలను తగ్గించింది. తగ్గిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజరేటర్లు తదితర గృహోపకరణాల ధరలను 8 శాతం తగ్గించినట్టు తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినందున ఆ మేరకు వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శాంసంగ్ పేర్కొంది.

గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా రిఫ్రిజరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మిషన్లు, చెస్ట్ ఫ్రీజర్ల ధరలను 7 నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఎల్‌జీ, పానసోనిక్ వంటి కంపెనీలు ఇది వరకే ధరల తగ్గింపుపై ప్రకటన చేశాయి.  
Sat, Jul 28, 2018, 07:58 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View