దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
Advertisement
బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. రూ.190 తగ్గడంతో ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.30,470గా ఉంది. అంతర్జాతీయంగానూ 0.73 శాతం బంగారం ధర తగ్గింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ ధర 1,222.40 డాలర్లుగా ఉంది.

ఇక వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా స్వల్పంగా తగ్గాయి. రూ.230 తగ్గడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ.39,200 పలికింది. అంతర్జాతీయంగా 1.48 శాతం తగ్గి ఔన్స్ ధర 15.35 డాలర్లుగా ఉంది. కాగా, దేశీయంగా స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బంగారం; పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధరలు తగ్గాయని సంబంధిత వర్గాల సమాచారం.
Fri, Jul 27, 2018, 09:34 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View