మందుకొట్టి ఆర్టీసీ బస్సును అపహరించిన విద్యార్థి.. ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు!
Advertisement
ఫుల్లుగా మందుకొట్టిన 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆర్టీసీ బస్సును దొంగిలించి యాక్సిడెంట్ చేశాడు. హరియాణాలోని హిసార్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మిర్చ్‌పూర్‌కు చెందిన విద్యార్థి ప్రవీణ్ (19) కాలేజీ నుంచి ఇంటికి వస్తూ మధ్యలో మద్యం తాగాడు. హరియాణా రోడ్ వేస్‌కు చెందిన బస్సు గ్రామంలో పార్క్ చేసి ఉండడంతో ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చుని మోటార్ సైకిల్ కీతో తంటాలు పడి బస్సును స్టార్ట్ చేశాడు.

బస్సును నడుపుకుంటూ వెళ్లిన ప్రవీణ్ రాజ్‌పురా భైన్ గ్రామానికి చేరుకునే సరికి నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టాడు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రవీణ్‌ను బయటకు లాగేందుకు గ్రామస్తులకు మూడు గంటలు పట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బస్సు చోరీకి గురైందని తెలుసుకున్న హిసార్ యూనిట్ వర్క్ మేనేజర్ జితేందర్ యాదవ్ వెంటనే మిర్చ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బస్సును నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన డ్రైవర్, కండక్టర్‌పై డిపార్ట్‌మెంటల్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Fri, Jul 27, 2018, 10:39 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View