శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆదాయపన్ను గడువు నెల రోజుల పొడిగింపు!
Advertisement
ఆదాయపన్ను కట్టేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పన్ను చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ‘ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్’ (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఆదాయపన్ను రిటర్న్స్‌కు ఈ నెల 31 చివరి తేదీ, అయితే, గడువును పొడిగించాలంటూ పలు సంస్థల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పెంచిన గడువు లోపల పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే రూ.1000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, అపరాధ రుసుం ఎంత అనే దానిని పన్ను చెల్లించిన తేదీని బట్టి నిర్ణయిస్తారు.  
Fri, Jul 27, 2018, 06:54 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View