ఆకట్టుకునే ఫీచర్లతో మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది!
Advertisement
మోటోరోలా కంపెనీ నుండి త్వరలో మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేయనున్నట్లు మోటోరోలా సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఈ ఫోన్ లో ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ ని అమర్చారు. మార్కెట్ కి విడుదలయ్యే నాటికి 630 ప్రాసెసర్ కి బదులుగా స్నాప్‌డ్రాగన్ 636కి అప్ గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 5.99ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080x2160పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గల ఈ ఫోన్లో 3200ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. వినియోగదారులను ఆకట్టుకునే పలు ఫీచర్లతో పాటు 12/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా సదుపాయం కూడా దీనికి కల్పించారు. 3/4జీబీ ర్యామ్, 32/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.20,000గా ఉండొచ్చు. కాగా ఈ ఫోన్ విడుదల తేదీని ప్రకటించనప్పటికీ, ఆగష్టు రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Thu, Jul 26, 2018, 01:32 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View