ఒక్క ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి, 82.5 లక్షలు సంపాదిస్తున్న కోహ్లీ!
Advertisement
విరాట్ కోహ్లీ... తన సోషల్ మీడియా ఖాతాల్లో కోట్లాది మంది అభిమానులను కలిగున్న ఈ స్టార్ క్రికెటర్, ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ప్రచార చిత్రం ఉంచేందుకు ఎంత తీసుకుంటాడో తెలుసా? ఇన్ స్టాగ్రామ్ లో ప్రచార చిత్రాలను షెడ్యూలింగ్ చేసే 'హాపర్ హెచ్ క్యూ' అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక పోస్టుకు కోహ్లీ సుమారు రూ. 82.5 లక్షలు తీసుకుంటాడు. క్రీడాకారుల జాబితాలో కోహ్లీ స్థానం 9 కాగా, ప్రపంచ స్థాయిలో 17వ స్థానం.

తమ అభిమాన క్రికెటర్ నుంచి వచ్చిన పోస్టును వేలాది మంది షేర్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అది అలా అలా వైరల్ అవుతుంది. దీంతో సదరు ప్రచార చిత్రాన్ని ఇచ్చిన కంపెనీకి మేలు కలుగుతుందన్న సంగతి తెలిసిందే. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే పోస్టుకు అత్యధికంగా డబ్బు తీసుకునేది ఎవరో తెలుసా? ప్రముఖ యూఎస్ మోడల్ కెల్లీ జెన్నర్. ఆమె ఒక పోస్టుకు రూ. 6.86 కోట్లు తీసుకుంటుందని  'హాపర్ హెచ్ క్యూ' వెల్లడించింది.
Thu, Jul 26, 2018, 09:08 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View