సెన్సెక్స్ లాభాల్లో.. నిఫ్టీ నష్టాల్లో!
ఈరోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా, నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 36,858 పాయింట్ల వద్ద ముగిసి సరికొత్త రికార్డు సృష్టించింది. నిఫ్టీ మాత్రం 2 పాయింట్ల నష్టంతో 11,132 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇక షేర్ల లాభ నష్టాల విషయానికొస్తే, ఎన్ఎస్ఈలో ఎస్బీఐ, యూపీఎల్ లిమిటెడ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అదానీ స్పోర్ట్స్ సంస్థలు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, లుపిన్ తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి.  
Wed, Jul 25, 2018, 05:46 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View