రూ.7499లకే కోమియో ఎక్స్1 స్మార్ట్‌ఫోన్!
Advertisement
చైనా మొబైల్ సంస్థ కోమియో తన నూతన స్మార్ట్‌ఫోన్ కోమియోఎక్స్1 ను తాజాగా విడుదల చేసింది. 5.50 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గల ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.7,499 ధరకి లభిస్తుంది. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ కి వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాని అమర్చారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్లో డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీలాంటి పలు ఆకట్టుకొనే ఫీచర్లు ఉన్నాయి. సన్ రైజ్ గోల్డ్, రాయల్ బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.
Tue, Jul 24, 2018, 12:46 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View