డ్యూయల్‌ కెమెరాలతో మొట్ట మొదటి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల!
Advertisement
ప్రముఖ మొబైల్‌ సంస్థ బ్లాక్‌బెర్రీ ఆకట్టుకొనే క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు, డ్యూయల్‌ కెమెరాలాంటి ఫీచర్లతో నూతన స్మార్ట్‌ఫోన్‌ ని విడుదల చేసింది. ‘బ్లాక్‌బెర్రీ కీ2’ పేరిట తాజాగా భారత మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌, ఈ నెల 31 నుండి అమెజాన్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.

 క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు తో పాటు 4.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ని ఇందులో ఏర్పాటు చేశారు. ధర రూ.42,990గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలిసారిగా డ్యూయల్‌ కెమెరాలతో విడుదల అవుతోంది. అలాగే ‘బ్లాక్‌బెర్రీ కీ2’ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం జియో సంస్థ రూ.4,450 విలువ గల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని ప్రకటించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ఉపయోగించి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని పొందవచ్చు.

‘బ్లాక్‌బెర్రీ కీ2’ ఫీచర్లు:

Mon, Jul 23, 2018, 04:04 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View