28 శాతం జీఎస్టీ శ్లాబ్ లో మిగిలిన వస్తువుల వివరాలు!
Advertisement
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులోకి వచ్చిన తరువాత, అత్యధిక శ్లాబ్ అయిన 28 శాతం పన్ను పరిధిలో 35 వస్తువులు మాత్రమే మిగిలాయి. గత సంవత్సరం జూలై 1న జీఎస్టీ అమలులోకి రాగా, ఆ సమయంలో దాదాపు 226కి పైగా వస్తువులు ఈ శ్లాబ్ లో ఉండగా, పలుమార్లు సమావేశమైన జీఎస్టీ మండలి నెమ్మదిగా ఈ సంఖ్యను తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మిగిలిన 35 వస్తువుల్లో ఎయిర్ కండిషనర్లు, డిజిటల్ కెమెరాలు, డిష్ వాషింగ్ మెషీన్లు, సిమెంట్, వీడియో రికార్డర్లు, టైర్లు, మోటారు వాహనాలు, విమానాలు, కొన్ని పానీయాలు, ఆటోమోబైల్ విడిభాగాలు, మర పడవలు, పొగాకు ప్రొడక్టులైన సిగరెట్లు, పాన్ మసాలా తదితరాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం మొత్తం 5 పన్ను శ్లాబ్ లు అమలవుతుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను మూడుకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని జీఎస్‌టీ నెట్‌ వర్క్‌ సంఘం అధ్యక్షుడు సుశీల్‌ మోదీ తెలిపారు. 
Mon, Jul 23, 2018, 08:33 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View