ఏడు నెలల చిన్నారి కురులను చూసి నెటిజన్ల ఫిదా!
Advertisement
ఆ పాప వయసు ఏడంటే ఏడు నెలలు. అయితేనేం నెట్టింట ఆమెకు 46 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆమె తల వెంట్రుకలు పెరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకే. జపాన్ కు చెందిన చాంకో అనే పాప, తన అందమైన కురులతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

ఏడు నెలలకే ఇంత జుట్టు ఎలా వచ్చిందా అని తెగ ఆశ్చర్యపోతున్నారు పాప ఫొటోలను చూసిన వారు. పుట్టుకతోనే అధిక జుట్టుతో పుట్టిన చాంకోకు, నెలలు గడిచే కొద్దీ మరింతగా వెంట్రుకలు రావడం మొదలైందని పాప తల్లి చెబుతోంది. గత సంవత్సరం డిసెంబర్ లో జన్మించిన చాంకో ఫొటోలను ఎప్పటికప్పుడు వాళ్లమ్మ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటే, వేల మంది చాంకో ఫ్యాన్స్ అయిపోయారు.
Sun, Jul 22, 2018, 10:32 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View