‘హగ్స్ ఇన్ పార్లమెంట్’ అంటూ ‘అమూల్’ సెటైర్లు
Advertisement
నిన్న లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగం ముగించిన వెంటనే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన్ని కౌగిలించుకోవడం, ఆ తర్వాత తన సహచరుల వైపు చూసి కన్నుగీటడం తెలిసిందే. కౌగిలించుకోవడం-కన్నుగీటడం.. ఈ రెండు సన్నివేశాలను ఆధారంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి.

తాజాగా, గుజరాత్ కు చెందిన అమూల్ కో-ఆపరేటివ్ డెయిరీ దీనిపై ఓ వ్యంగ్య చిత్రాన్ని రూపొందించి తన ప్రచారానికి వాడుకుంది. ఈ వ్యంగ్య చిత్రంలో కుర్చీలో కూర్చుని ఉన్న మోదీని రాహుల్ కౌగిలించుకుంటూ..కన్నుగీటుతుండటం మనకు కనిపిస్తుంది. ‘కౌగిలించుకుంటున్నారా మీరు ఇబ్బందిపెడుతున్నారా?’ అనే క్యాప్షన్ తో పాటు ‘అమూల్.. హగ్స్ బ్రెడ్ డైలీ!’ అని రాసి ఉంది. ఈ వ్యంగ్య చిత్రాన్ని అమూల్’ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Sat, Jul 21, 2018, 04:16 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View