పరాచికాలు ఆడిన కొంగ... గుటుక్కున మింగిన మొసలి!
Advertisement
"డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాపుకెళ్లి తొడ కొట్టిందట" ఆ మధ్య వచ్చిన ఓ హిట్ సినిమాలోని డైలాగిది. అచ్చం ఆ కోడిలాగానే ప్రవర్తించి ఓ మొసలికి ఆహారమైపోయిందీ కొంగ. కెన్యాలోని మారా నదిలో ఎన్నో మొసళ్లు ఆవాసం ఉంటుంటాయి. వాటి వద్దకు వెళ్లిన ఓ కొంగ, నదిలోని మొసలి ముందు నిలబడి దానితో పరాచకాలు ప్రారంభించింది. కాసేపు దాని పరాచికాలను చూసిన మొసలి, ఒక్క ఉదుటన ముందుకు దూకి, కొంగ తేరుకునేలోపే కబళించేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాలను బంధించగా అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.
Fri, Jul 20, 2018, 08:30 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View