ముకేశ్ అంబానీ కంటే సునీల్ మిట్టల్ వేతనమే ఎక్కువ.. అయినా అత్యంత సంపన్నుడిగా ముకేశ్!
Advertisement
దేశంలోనే అంత్యంత  సంపన్నడైనప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వేతనం మాత్రం తక్కువే. భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌‌ వేతనంతో పోలిస్తే అంబానీ జీతం సగమే. 2017-18లో మిట్టల్ రూ.30.19 కోట్లను వేతనంగా అందుకోగా, ముకేశ్ అంబానీ అందుకున్నది 15 కోట్ల రూపాయలు మాత్రమే. వేతనం తక్కువే అయినప్పటికీ ముకేశ్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. ముకేశ్ మొత్తం ఆస్తి 45.1 బిలియన్ డాలర్లు కాగా, సునీల్ మిట్టల్ ఆస్తి 6.9 బిలియన్ డాలర్లు.
Thu, Jul 19, 2018, 10:25 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View