ర్యాంప్ పైనే బిడ్డకు పాలిచ్చిన మోడల్... మెచ్చుకుంటున్న నెటిజన్లు!
Advertisement
మారా మార్టిన్... ఆమె ఓ ప్రముఖ స్విమ్ సూట్ మోడల్. డిజైన్ చేసిన దుస్తులను ర్యాంప్ పై ప్రదర్శిస్తుంటుంది. అయితేనేం ఆమెలోనూ ఓ తల్లి ఉంది. బిడ్డ ఏడుపును తట్టుకోలేని మనసుంది. బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడని తెలిసి, ర్యాంప్ పైనే బిడ్డను చేతుల్లోకి తీసుకుని పాలిచ్చింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ కాగా, పలువురు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

మియామీ స్విమ్ వీక్ లో భాగంగా మరో 16 మందితో కలసి ఆమె ర్యాంప్ వాక్ చేసింది. ఆమెకు ఐదు నెలల చిన్నారి ఉండగా, ఆమె ప్రదర్శిస్తున్న సమయంలో బిడ్డకు పాలివ్వాల్సి వచ్చింది. తల్లిగా తన బాధ్యతను ప్రేక్షకుల ముందే నెరవేర్చడానికి ఆమె ఏ మాత్రం బిడియ పడకుండా పాలిచ్చింది. మాతృత్వానికి ఆమె మారు పేరని, స్ట్రాంగ్ ఉమెన్ అని నెటిజన్లు పొగడుతుంటే, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంది మారా.
Thu, Jul 19, 2018, 09:19 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View