ఈ సంవత్సరం కొత్త టెక్ ఉద్యోగాలు అతి తక్కువ: నాస్ కామ్
Advertisement
ఈ సంవత్సరం భారత ఐటీ కంపెనీల్లో కొత్తగా సృష్టించే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని ఇండస్ట్రీ బాడీ నాస్ కామ్ వెల్లడించింది. ఈ సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి 7.9 శాతంగా ఉండగా, ఉద్యోగాలు మాత్రం తగ్గనున్నాయని తన నివేదికలో తెలిపింది. గత సంవత్సరం 3 లక్షల టెక్నాలజీ ఉద్యోగాల సృష్టి జరిగిందని గుర్తు చేసిన నాస్ కామ్, ఈ సంవత్సరం 2.50 లక్షల ఉద్యోగాలు మాత్రమే రానున్నాయని అంచనా వేసింది.

 ఇవి ప్రారంభ అంచనాలు మాత్రమేనని, మరింతగా తగ్గవచ్చని కూడా పేర్కొంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్లు గత సంవత్సరంలానే 1.20 లక్షల వరకూ ఉండవచ్చని, 2 నుంచి 8 సంవత్సరాల అనుభవం అవసరమైన ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గుతుందని తెలిపింది. టీసీఎస్ వంటి పెద్ద కంపెనీల్లో అట్రిషన్ రేటు 10 శాతం వరకూ ఉంటుందని, ఇదే సమయంలో రిటెన్షన్ రేటు గరిష్ఠానికి చేరుకుందని, ఈ కారణంతో కూడా ఉద్యోగాల సృష్టిపై ఒత్తిడి ఉందని తెలిపింది.
Wed, Jul 18, 2018, 11:24 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View