ఫార్మా, ఎనర్జీ, బ్యాంకింగ్ అండ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Advertisement
ఫార్మా, ఎనర్జీ, బ్యాంకింగ్ స్టాకుల అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మరోసారి 11 వేల మార్కును అధిగమించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 196 పాయింట్లు పెరిగి 36,520కి ఎగబాకింది. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 11,008 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఫెడరల్ బ్యాంక్ (19.16%), కార్పొరేషన్ బ్యాంక్ (10.88%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటాకామ్ (9.94%), మంగళూరు రిఫైనరీ (9.29%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (8.73%).
 
టాప్ లూజర్స్:
డీబీ కార్ప్ (-8.57%), పీసీ జువెలర్స్ (-6.64%), వక్రాంగీ (-4.98%), క్వాలిటీ (-4.85%), ఎంఫాసిస్ (-4.66%). 
Tue, Jul 17, 2018, 04:07 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View