ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతుంటే... యువతికి ప్రపోజ్... వైరల్ అవుతున్న వీడియో!
Advertisement
ప్రతి ప్రేమ కథలోనూ అమ్మాయి అబ్బాయితోనో, అబ్బాయి అమ్మాయితోనో ప్రపోజ్ చేసే సన్నివేశం ఒకటి ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఉంటుంది. మనసుకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయడానికి యువత వినూత్న మార్గాన్ని, సమయాన్ని ఎంచుకుంటారు. ఇండియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో నిన్న జరిగిన రెండో వన్డేలో ఇదే చోటుచేసుకుంది.

తనకు నచ్చిన అమ్మాయికి ఓ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే, అమ్మాయి సిగ్గుతోనే అంగీకరించింది. చుట్టూ ఉన్నవారు చప్పట్లతో తమ హర్షాతిరేకాన్ని, అభినందనలను తెలిపారు. లార్డ్స్ మైదానంలో తొలి లవ్ ప్రపోజల్ అని చెబుతూ, ఈ వీడియోను కలికా అనే ట్విట్టర్ యూజర్ తన సోషల్ మీడియాలో పంచుకోగా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సైతం స్పందించింది. గత సంవత్సరం కూడా ఓ జంట ఇదే మైదానంలో ఒకటైందని, ప్రేమ ఎప్పుడూ ఉంటుందని చెప్పింది. ఈ వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.
Sun, Jul 15, 2018, 08:43 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View