సమయస్ఫూర్తితో వ్యవహరించి.. అగ్ని ప్రమాదాన్ని తప్పించిన చైనా యువతి.. వీడియో వైరల్
Advertisement
పెట్రోల్‌ బంకులో పని చేస్తోన్న ఓ యువతి సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా చేసింది. ఓ వ్యక్తి పెట్రోల్ కోసం త్రిచక్ర వాహనంపై అక్కడికి రాగా అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ యువతి అగ్నిమాపక పరికరం తీసి మంటలను ఆర్పేసింది.

త్రిచక్ర వాహనానికి మంటలు అంటుకున్న నేపథ్యంలో అందరూ పరుగులు తీస్తుండగా ఆ యువతి మాత్రం ఎంతో ధైర్యంగా వ్యవహరించడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మంటలను కేవలం 12 సెకన్లలో ఆమె అదుపు చేసింది. చైనాలోని జియాంగ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
Fri, Jul 13, 2018, 06:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View